తారక్, బన్నీలకే కండిషన్లు పెట్టిన తార.!!

  • July 12, 2016 / 12:54 PM IST

నేచురల్ స్టార్ నాని జెంటిల్ మాన్ సినిమాలో బాగా నటించి మంచి పేరు తెచ్చుకున్న కేరళ కుట్టి నివేతా థామస్. స్కిన్ షోకి దూరంగా ఉంటూనే తన అందం, అభినయంతో యువత మనసు దోచుకుంది ఈ భామ. ఒక్క విజయంతో తెలుగు సినీ నిర్మాతల చూపు తన వైపు తిప్పుకుంది. ఎన్నో స్క్రిప్ట్ లు ఆమె కోసం ఎదురు చూస్తున్నా.. ఆచి తూచి అడుగులు వేస్తోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గారేజ్ తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. అందులో హీరోయిన్ గా నివేతా ను అనుకున్నారు. ఆమె కూడా తారక్ పక్కన నటించేందుకు సంతోషంగా ఒప్పుకుంది. కానీ కొన్ని షరతులు పెడుతోందని రీసెంట్ గా తెలిసింది. అందంగా కనిపించడానికి తాను సిద్ధమేనని, ఎక్స్ పోజింగ్ మాత్రం చేయనని చెప్పిందంట. అల్లు అర్జున్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రానున్న సినిమా కోసం సంప్రదిస్తే కూడా ఇదే మాట చెప్పిందని సమాచారం.

ఏరికోరి టాలీవుడ్ యంగ్ హీరోలతో నటించే అవకాశాలు వస్తుంటే నివేతా ఇలా ఎందుకు చేస్తోందని ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. గతంలో ఇలా సౌందర్య షరతులు పెట్టి అవకాశాలతో పాటు విజయాలను సొంతం చేసుకుంది. ఆమె బాటలో నడుద్దామని భావిస్తున్న నివేత కు ఎన్ని అవకాశాలు తలుపు తడతాయో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus