ఇప్పుడు ఎక్కడ విన్నా…ఎక్కువగా వినిపిస్తున్న పేరు “నివేదితా థామస్”. తమిళ దృశ్యం సినిమాలో యూనివర్సల్ స్టార్ “కమల్” తో నటించిన ఈ భామ, తాజాగా ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కించిన థ్రిల్లర్ నాని ‘జెంటిల్ మాన్’ సినిమాతో టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా మారిపోయింది. అయితే ఇదిలా ఉంటే ఒక్కసారిగా ఆమెపై ఫోకస్ పెరగడంతో పెద్ద హీరోలు అందరూ ఆమె చుట్టూ ఈగల్లా మారిపోయారని తెలుస్తుంది. దర్శకులను, నిర్మాతాలను ఇబ్బందులు పెడుతూ ఎలా అయినా ఆమెను ఒప్పించామని చెబుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ఆమె మాత్రం కాస్త డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. తనను కలిసిన నిర్మాతలతో దర్శకులతో తాను నటించే సినిమాలలో గ్లామర్ గా కనిపించడానికి తనకు అభ్యంతరం లేదు కాని తాను స్కిన్ షోకు సహకరించను అనే కండిషన్ తో పాటు తాను నటించబోయే సినిమాలోని పాత్ర తనకు బాగా నచ్చడమే కాకుండా ప్రాధాన్యత ఉండాలి అని కండీషన్స్ పెడుతూ దర్శక నిర్మాతలకు తలనొప్పిగా మారిందట. అసలే అందాల భామల తాకిడి ఎక్కువ. అందులోనూ చూపించాల్సింది చూపించకపోతే అసలు సినిమాలే చూడని కాలంలో ఉన్నాం.
అలాంటిది ఆమె చూపించను అంటే ఇప్పుడున్న పరిషితుల్లో కష్టం అనే చెప్పాలి. ఇదిలా ఉంటే మరో పక్క జూనియర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో, అల్లుఅర్జున్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించబోయే సినిమాలలో ఏదోవిధంగా ఆమె కండీషన్స్ ని బాయ్ కాట్ చేయించాలి అని దర్శక నిర్మాతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు…చూడాలి మరి ఏం జరుగుతుందో.