కేరళ బ్యూటీ నివేతా థామస్ చిన్నప్పటి నుంచి ధైర్యవంతురాలు. తనకి నచ్చినట్టు ఉంటారు. ఉన్నదీ స్పష్టంగా చెబుతారు. సినిమా పరిశ్రమలో లౌక్యంగా ఉండాలని అంటుంటారు. ఆవిషయాన్ని అసలు పట్టించుకోరు. ముక్కుసూటిగానే ఉంటారు. రీసెంట్ గా మొబైల్ నెంబర్ కావాలని ఓ అభిమాని అడిగితే సింపుల్ గా సూటిగా ఇవ్వను అని చెప్పి షాక్ ఇచ్చింది. తాజాగా మరో సారి తన స్ట్రైట్ ఫార్వార్డ్ తో ఆకట్టుకుంది. నేచురల్ స్టార్ నాని “జెంటిల్‌మేన్” సినిమాతోతెలుగు వారికి పరిచయమయిన నివేతా థామస్… దాని తర్వాత కూడా నానితో నిన్నుకోరి మూవీ చేసి హిట్ అందుకుంది. తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమాలో హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది.
ఈ చిత్రం విజయం తర్వాత ఆమెకు అనేక అవకాశాలు వచ్చినా పక్కన పెట్టింది. డిగ్రీ ఆఖరి సెమిస్టర్ పరీక్షలు పూర్తి చేసి కొత్త చిత్రానికి సైన్ చేసింది. కళ్యాణ్ రామ్ సరసన జోడీగా నటిస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రఫర్ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీలో షాలినీ పాండే తో కలిసి స్క్రేన్ షేర్ చేసుకోబోతోంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన ఆమెను పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అని ప్రశ్నిస్తే.. “సరైన సమయం ఎప్పుడని అనిపిస్తే అప్పుడే పెళ్లి చేసుకుంటాను. పెళ్లి అనేది పూర్తిగా నా ఇష్టం. పెళ్లి తరవాత కూడ నటనను కొనసాగిస్తాను” అని సమాధానమిచ్చారు.