స్టడీస్ కోసం స్టార్ డమ్ వద్దనుకొన్న నివేదా

  • December 28, 2017 / 12:34 PM IST

టాలీవుడ్‌లో హ్యాట్రిక్ విజయాలతో ఊపుమీదున్న అందాల బొమ్మ నివేదా థామస్ కొద్ది రోజులు సినిమాలకు విరామం ఇవ్వనుంది. దీంతో, తనకు ఆఫర్లు వరుస కడుతున్నా.. ఏ సినిమాకు డేట్లు ఇవ్వడం లేదు. “జెంటిల్ మ్యాన్” సినిమాతో పరిచయమైన నివేదా థామస్.. ఈ ఏడాది నటించిన “నిన్ను కోరి, జై లవ కుశ” సినిమాలతో విజయాలు అందుకుంది. అయితే.. నివేదా కెరీర్ తొలినాళ్లలో నటించిన “జూలియట్‌ లవర్‌ ఆఫ్‌ ఇడియట్‌” ఇటీవల విడుదలై పరాజయం పాలైంది. ఆ సినిమాని నివేదా కూడా అంతగా పట్టించుకోలేదనుకోండి.

అయితే, ఈ సినిమా పరాజయం ఆమె ఆఫర్లపై ఎలాంటి ప్రభావం చూపలేదు. తనకు ఆర్కిటెక్చర్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో సినిమాలకు కొద్ది రోజులు విరామం చెప్పాలని నిర్ణయించుకుంది. బాలనటిగా సినీరంగంలోకి ప్రవేశించిన 22 ఏళ్ల నివేదా మంచి నటి మాత్రమే కాదు.. చదువులో కూడా ప్రతిభవంతురాలే. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్న చదువును మాత్రం విస్మరించకపోవడం నివేదాకే చెల్లుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus