బ్ర‌హ్మోత్స‌వానికి ‘బ‌య్య‌ర్లు’ లేరా???

ప్రిన్స్ మహేష్ బాబు!!..ఈ పాల బుగ్గల చిన్నోడు టాలీవుడ్ లో టాప్ స్టార్ గా ఎదగడమే కాకుండా…అటు కోలీవుడ్ లోను, ఇటు బాలీవుడ్లోను పాగా వెయ్యాలి అని చూస్తున్నాడు. వరుస హిట్స్ తో బడా హీరోల్లోనే కాకుండా, టోటల్ టాలీవుడ్ లోనే టాప్ హీరోగా నిలిచిన ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం శ్రీమంతుడు మ‌హేష్ క్రేజ్ ను అమాంతం పెంచేసి దాదాపుగా రూ.160 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌తో పాటు రూ.90 కోట్ల షేర్ రాబట్టి మ‌హేష్ స్టామినాను మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద రుచి చూపించింది. అదే క్రమంలో ఈ సినిమాను కోలీవుడ్ లో సెల్వ‌నంద‌న్ పేరుతో డబ్ చేశారు..

సినిమాకు ఓపెనింగ్స్ అయితే వచ్చి యావరేజ్ అన్న టాక్ అయితే వచ్చింది కానీ, వసూళ్లు మాత్రం పెద్దగా రాలేదు. సెల్వ‌నంద‌న్‌కు అక్క‌డ కేవ‌లం రూ 2.5 కోట్లు మాత్ర‌మే రాగ…ఆ రిసల్ట్ ను మైండ్ లో పెట్టుకోకుండా మన నిర్మాతలు కాస్త దూకుడుగా వ్యవహరించడంతో తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లో కూడా త‌న మార్కెట్ పెంచుకోవాల‌నుకుంటున్న మహేష్ ఆశలపై నీళ్ళు చల్లినట్లు అయ్యింది. ఇంతకీ విషయం ఏంటంటే…మహేష్ తాజా చిత్రం బ్ర‌హ్మోత్స‌వంను కూడా అక్క‌డ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు…అయితే తమిళ హక్కులకోసం నిర్మాతలు భారీ రేటు చెబుతుండడంతో అక్కడ సినిమాలు కొనుగోలు చేసేవారు వెనకంజు వేస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన శ్రీమంతుడు సినిమానే అక్కడ డమాల్ మనగా…పూర్తి కుటుంభ కధ నేపధ్యంలో వస్తున్న ఈ బ్రహ్మోత్సవంకి అక్కడ ఎలాంటి స్పందన వస్తుందో అన్న భయంతో కొనుగోలుదారులు కాస్ట్ర వెనకంజు వేస్తున్నారు…మరి దీనిపై మహేష్ ఏం ఆలోచిస్తాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus