Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

సినిమాను అంతర్జాతీయ స్థాయికి పెంచాలి అనుకుంటే.. కథ స్పాన్‌ పెరగాలి. నేపథ్యం అంతర్జాతీయంగా ఉండాలి. అంతే తప్ప అంతర్జాతీయ నటులను సినిమాలోకి తీసుకొస్తే పెరిగిపోదు. ఈ విషయం టాలీవుడ్‌లో అందరికీ తెలుసు. అయినా ఎందుకో కానీ అంతర్జాతీయ నటులను సినిమాల్లోకి తీసుకొస్తారు అని ఎవరైనా అంటే.. అమాంతం ఆసక్తి చూపించేస్తారు. ఆ తర్వాత ఆ సినిమాలో ఆ యాక్టర్‌ లేడు అనేసరికి నీరసపడిపోతారు. ఇప్పుడు ప్రభాస్‌ అభిమానులది ఇదే పరిస్థితి.

Spirit

ఎందుకంటే సందీప్‌ రెడ్డి వంగాతో ప్రభాస్‌ చేస్తున్న ‘స్పిరిట్‌’ సినిమా గురించి గత కొన్ని రోజులుగా ఎప్పుడు, ఎవరు మాట్లాడినా మన కొరియన్‌ బాలయ్య అలియాస్‌ డాన్‌ లీ గురించి చర్చ వస్తూనే ఉంది. ఈ సినిమాలో డాన్‌ లీ కీలక పాత్రలో నటిస్తున్నాడు అంటూ పెద్ద ఎత్తున చర్చ పెడుతూనే ఉన్నారు. సినిమా షూటింగ్‌ మొదలైపోయింది.. డాన్‌ లీ లేడు అని చెప్పినా వినడం లేదు. ఇప్పుడు సినిమా నిర్మాత ప్రణయ్‌ రెడ్డి వంగా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు.

‘స్పిరిట్‌’ సినిమాలో డాన్‌ లీ లేడు. సినిమా గురించి తొలి రోజుల్లో మాట్లాడేటప్పుడు డాన్‌ లీ ఈ సినిమాలో తీసుకుందాం అనుకున్నాం. కానీ సినిమా కథ గురించి పట్టించుకుంటే ఈ సినిమా ఆ సౌత్‌ కొరియన్‌ యాక్టర్‌ అవసరం లేదు అనిపించింది. దాంతో ఆ ప్రయత్నాలు మొదట్లోనే ఆగిపోయాయి అని ఆయన చెప్పారు. అంతేకాదు ఈ సినిమా ప్యూర్‌ హైదరాబాద్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమా అని తేల్చేశారు. దీంతో ‘స్పిరిట్‌’ మీద ఇన్నాళ్లూ వండిన పుకార్లన్నీ నిలిచిపోయాయి.

నిజానికి ఈ మాటలు బయటకు రావడానికి కారణం ఆ సినిమా టీమే. సినిమా పోస్టర్‌ మీద సినిమా అంతర్జాతీయ భాషల పేర్లు కూడా రాశారు. అంటే ఈ సినిమాను విదేశాల్లో డబ్బింగ్‌ చేసి రిలీజ్‌ చేస్తారని.. అందుకే డాన్‌ లీ లాంటివారిని తీసుకుంటున్నారు అని రూమర్లు పుట్టేశాయి. ఇప్పుడు ఇక ఆగాల్సిందే.

అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus