డబ్బింగ్ కూడా చెప్పించలేదు!

  • April 6, 2016 / 10:33 AM IST

ఇతర బాషల్లో విజయం సాధించిన చిత్రాలను తెలుగులో అనువాదరూపంలో విడుదల చేయడం సర్వసాధారణం. సినిమాను కొన్న నిర్మాతను బట్టి.. సదరు సినిమా అనువాదరూపం క్వాలిటీ ఉంటుంది. అయితే.. ఓ అగ్ర నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న ఒక అనువాద చిత్రం టీజర్ నిన్న విడుదలైంది. అచ్చుగుద్దినట్లు తమిళ వెర్షన్ లాగే ఉంది అనే విషయం పక్కనపెడితే.. కనీసం డబ్బింగ్ కూడా చెప్పించలేదు.
ఇక్కడ మనం మాట్లాడుకొంటున్నది తెలుగులో “పోలీసోడు”గా అనువాదమవుతున్న తమిళ “తేరీ”. విజయ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు విడుదల చేస్తున్నారు.
నిన్న విడుదలైన ఈ చిత్రం టీజర్ కు కనీసం తెలుగు వెర్షన్ డబ్బింగ్ సైతం చెప్పించకుండా కేవలం తెలుగు టైటిల్ తో రిలీజ్ చేయడం పట్ల సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి.
ప్రముఖ నిర్మాత అయిన దిల్ రాజు కూడా ఈ విధంగా చేయడం పట్ల ఈ సినిమా తెలుగు వెర్షన్ కోసం ఎదురుచూస్తున్నవారందరూ పెదవి విరిచారు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus