స్పైడర్ సినిమా పై మాస్ ఆడియెన్స్ ఆశలు వదిలేసుకోవాల్సిందెనేమో!

  • June 3, 2017 / 09:15 AM IST

స్పైడర్…స్పైడర్…స్పైడర్…ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట, ఎక్కడ చూసిన దీని గురించే డిస్కషన్, ఈ సినిమా ఫర్స్ట్ లుక్ తో ఈ సినిమా ఒక పూర్తి క్లాస్ మూవీ అని, మనకు చెప్పే ప్రయత్నం చేసిన ప్రిన్స్, అటు తరువాత రిలీజ్ చేసిన టీజర్ తో ఈ సినిమా పూర్తి సైన్స్ ఫిక్షన్ అని భారీ హింట్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ యూ ట్యూబ్ లో సృష్టిస్తున్న రికార్డుల లెక్కలు లెక్క లేకుండా పోతున్నాయి. కేవలం విడుదలయిన 12 గంటల్లోనే 4 మిలియన్లకు పైగా వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన స్పైడర్ అదే కోవలో మరిన్ని రికార్డుల దిశగా దూసుకుపోతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

అయితే ఆ కధ అంతా పక్కన పెడితే, అసలు స్పైడర్ టీజర్ లో ఎక్కడా మాస్ ఎలిమెంట్స్ లేకపోవడంతో ఈ సినిమాపై మాస్ ఆడియెన్స్ ఆశలు వదిలేసుకోవాల్సిందెనేమో అన్న అనుమానం కలుగుతుంది. అయితే మాస్ అంటే మసాలా పాటలు, ఫైట్స్, చాసింగ్స్ ఉంటేనే కాదు కదా, మహేష్ ఎలాగో పోలీసు పాత్రలో నటిస్తున్నాడు కాబట్టి, బోలెడన్ని డైలాగ్స్, భారీ ఫైట్స్ ఉండనే ఉంటాయి. ఇక సాంగ్స్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనే లేదు, దర్శకుడు మురుగుదాస్ కనుక హీరోయిన్స్ అందాల ఆరబోత షరా మామూలే. ఇక హీరోయిన్ రాకుల ప్రీత్ కాబట్టి, ‘పారేషాను’ కావాల్సిన పనేలేదు. ఇలా ఏ కోణంలో చూసుకున్నా మాస్ ఎలిమెంట్స్ పైకి లేవని అనుకున్నా, సినిమాలో మాస్ మ్యాటర్ కు మాత్రం ఏమాత్రం డోకా ఉండదు అని చెప్పక తప్పదు. చూద్దాం మరి ఈ సినిమా ఏ వర్గాన్ని ఎంతవరకూ ఆకట్టుకుంటుందో.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus