సినిమాకు మహారాజా పోషకులు మాస్ ఆడియన్స్ అన్నది జగమెరిగిన సత్యం. కానీ.. సినిమాకు ఓవర్ సీస్ లో మంచి ఓపెనింగ్స్ రావాలన్నా, అక్కడ మంచి కలెక్షన్స్ సంపాదించాలన్నా క్లాస్ ఆడియన్స్ ను సంతృప్తిపరచక తప్పదు.
కానీ.. సందీప్ తాజా చిత్రం “ఒక్క అమ్మాయి తప్ప” క్లాస్ ఆడియన్స్ వీక్షించే మల్టీ ప్లెక్స్ లో మార్నింగ్ షోస్ లేకపోవడం గమనార్హం. సినిమా విడుదల ఇంకో రేండ్రోజుల్లో ఉండగా.. ఇప్పటివరకూ ఈ సినిమా మార్నింగ్ షోస్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అదే తేదీన విడుదలవుతున్న “రైట్ రైట్”కు అప్పుడే షోస్ కన్ఫర్మ్ అయిపోయాయి.
ఇలాంటి విషయాలన్నీ సినిమాపై నెగిటివ్ గా రియాక్షన్ ఇస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలే హిట్లు లేక ఢీలాపడ్డ సందీప్ ఈ విషయాన్ని త్వరగా గ్రహించి, తగిన జాగ్రత్తలు తీసుకొంటే మంచిది!