చిరంజీవి సినిమాతో ఇరుక్కు పోయిన వినాయక్!

  • March 8, 2017 / 01:20 PM IST

చిత్ర రంగంలో హిట్లు ఉంటేనే విలువ ఉంటుంది. అటు హీరోకైనా, ఇటు డైరక్టర్ కి అయిన సక్సస్ కొలమానం. ఒక్క హిట్ కొడితే చాలు ఎన్నో ఆఫర్లు వచ్చి పడతాయి. అయితే మాస్ డైరక్టర్ వివి వినాయక్ కి మాత్రం చేదు అనుభవం ఎదురైంది. ఆయన మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ నంబర్ 150 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అనేక రికార్డులు తిరగరాసింది. అటువంటి డైరక్టర్ కి చేతి నిండా సినిమాలు ఉండాలి. కానీ ఇప్పుడు ఆయన ఒక్క సినిమా కూడా చేయడం లేదు. కనీసం మెగా హీరోలు కూడా అతన్ని సంప్రదించలేదంట. మొన్నటి వరకు సాయి ధరమ్ తేజ్ తో వినాయక్ సినిమా చేస్తున్నారని వార్తలు వినిపించాయి. అయితే ఆ మూవీ కూడా ఆగిపోయినట్లు తెలిసింది. ఇక బన్నీ ప్రస్తుతం హరీష్ శంకర్ మూవీ చేస్తుండగా, అనంతరం వక్కంతు వంశీ ప్రాజక్ట్ కి ఒకే చెప్పారు.

పవన్ కళ్యాణ్ వరుసగా మూడు సినిమాలు లాక్ అయ్యాయి. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ సినిమా తర్వాత మణిరత్నంతో మూవీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అసలు తనకి సూపర్ రీఎంట్రీ మూవీ ఇచ్చిన విషయాన్నీ మరిచి చిరు సురేందర్ రెడ్డి ని 151 సినిమాకి డైరక్టర్ గా తీసుకున్నారు. వినాయక్ కి అవకాశాలు లేకుండా పోవడానికి మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హీరోలు తమ తమ ప్రాజక్టుల్లో లాక్ అయిపోవడమే కారణమని కొంతమంది చెబుతుండగా, మరికొంత మంది మాత్రం ఖైదీ నంబర్ 150 మేకింగ్ లో వినాయక్ ప్రతిభ ఏమీ లేదని విమర్శిస్తున్నారు. అందుకే అతనితో సినిమా చేయడానికి ఎవరూ ఉత్సాహంగా లేరని టాక్.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus