స్థాయితో సంబంధం లేకుండా ఈ హీరో సినిమాకి అయినా విడుదలకు ముందు సదరు సినిమాలోని పంచ్ డైలాగ్స్ నో లేక ఫైట్ సీన్స్ నో యాడ్స్ గా ప్లే చేస్తుంటారు. కానీ సాయిధరమ్ తాజా చిత్రం “సుప్రీమ్” సినిమా ప్రమోషన్స్ విషయంలో మాత్రం హీరోయిజంను ఏమాత్రం హైలైట్ చేయకుండా కేవలం హీరోయిన్
మరియు ఐటెమ్ సాంగ్ లోని గ్లామర్ డోస్ ను మాత్రమే వినియోగిస్తుండడం మెగా అభిమానులకు మింగుడు పడడం లేదు.
ముఖ్యంగా.. ఇప్పటివరకూ హీరోను పూర్తి స్థాయిలో ఎలివేట్ చేసే పోస్టర్ లేదా ప్రోమో ఒక్కటి కూడా విడుదల చేయకపోవడం వారి కోపానికి ముఖ్య కారణం. దిల్ రాజు కూడా తన మునుపటి చిత్రాల స్థాయిలో “సుప్రీమ్”ను ప్రమోట్ చేయకపోతుండడం సైతం పలు అనుమానాలకు తావిస్తోంది!