రాంగోపాల్ వర్మ ,మియా మల్కోవా కు నోటీసులు

నేను ఎంతో పవిత్రంగా స్క్రిప్ట్ ని రాసుకుంటే దాన్ని బూతుగా మార్చి నా కథ ని అభాసు పాలు చేసాడని దర్శకులు రాంగోపాల్ వర్మ పై సంచలన ఆరోపణలు చేయడమే కాకుండా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ని ఆశ్రయించాడు రచయిత పి . జయకుమార్ . తాజాగా రాంగోపాల్ వర్మ ” గాడ్ ,సెక్స్ అండ్ ట్రూత్ ” అనే అడల్ట్ స్టొరీ ని తెరకెక్కించాడు . పోర్న్ స్టార్ మియా మల్కోవా ని పెట్టి నగ్న షో చేసాడు వర్మ . ఆమధ్య రిలీజ్ చేసిన పోస్టర్ సంచలనం సృష్టించగా తాజాగా గాడ్ , సెక్స్ అండ్ ట్రూత్ ట్రైలర్ పెను సంచలనం సృష్టిస్తోంది . పూర్తిగా న్యూడ్ షోగా సాగిన ఈ ట్రైలర్ కేక పెట్టిస్తోంది అయితే అదే స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి . యువత ని పెడ త్రోవ పట్టేలా వర్మ చేస్తున్నాడని ఘాటు విమర్శలు కూడా చేస్తున్నారు .

ఇక ఈ చిత్ర కథకుడు జయకుమార్ విషయానికి వస్తే .. వర్మ రూపొందించినట్లుగా బూతు పురాణం లా నేను స్క్రిప్ట్ ని రాయలేదని , కానీ వర్మ మాత్రం నా స్క్రిప్ట్ ని పూర్తిగా నగ్నత్వం చేసాడని వర్మ పై నిప్పులు చెరుగుతున్నాడు . తన కథ ని పూర్తిగా శృంగార భరితంగా తీయడంతో హైదరాబాద్ కోర్టు ని ఆశ్రయించానని నా వాదనలు విన్న హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కాపీ రైట్ వైలేషన్ కింద దర్శకులు రాంగోపాల్ వర్మ తో పాటుగా పోర్న్ స్టార్ మియా మల్కోవా , యూ ట్యూబ్ ఛానల్ , విమియో మీద సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ లో నలుగురి కి నోటీసులు పంపారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus