బుల్లితెరఫై ఎన్టీఆర్, రానా యుద్ధం !

  • June 15, 2017 / 09:49 AM IST

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రభంజనం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇక అదే క్రమంలో ఎన్టీఆర్ విషయం కాస్త పక్కన పెడితే, బాహుబలి సినిమాలో భల్లాలదేవ పాత్రలో రానా నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ ఇద్దరూ స్లివర్ స్క్రీన్ లో దూసుకుపోతున్న విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే అసలు విషయం ఏమిటి అంటే, సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటివరకూ ఒకే సినిమాలో కనిపించని వీరు ఇప్పుడు బుల్లి తెర వేదికగా యుద్దానికి సిద్దం అవుతున్నారు అన్న టాక్ బలంగా వినిపిస్తుంది. అంతేకాదు ఆ యుద్దం ఆరభానికి అంతా సిద్దం అయిపోయింది కూడా. అసలు విషయం లోకి వెళితే…యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ స్మాల్ స్క్రీన్ పై తొలిసారి చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ అని తెలిసిందే. అయితే అదే క్రమంలో దానికి పోటీగా నెంబర్ 1 యారి అంటూ జెమినిలో రానాతో ఓ స్పెషల్ ప్రోగ్రాం చేస్తున్నారు. స్టార్ హీరోలుగా ఉన్న ఈ ఇద్దరు బుల్లితెర మీద చేస్తున్న ఈ ఫైట్ అత్యంత ఆసక్తికరంగా మారింది.

అయితే ఈ రెండు షోలలో రానా షో కి ఎక్కువ మైలెజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్న టాక్ బలంగా వినిపిస్తుంది..దానికి కారణం ఏంటి అంటే….బిగ్ బాస్ షో ఆల్రెడీ హింది భాషలో వచ్చిందే. ఆ ప్రోగ్రాం కాన్సెప్ట్ ఎలా ఉండబోతుందో అందరికి తెలుసు. ఏవన్నా చిన్న చిన్న మార్పులు ఉంటాయి తప్ప రియాలిటీ షో మాత్రం అదే. కాని రానా చేస్తున్న నెంబర్ 1 యారి ఎలా ఉండబోతుందో అని ఎక్సయిట్ మెంట్ స్టార్ట్ అయ్యింది. తెలుగు తమిళ భాషల్లో రాబోతున్న ఈ ప్రోగ్రాంలో రానా లుక్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. మరి ఇద్దరు టాలీవుడ్ టాప్ స్టార్ బుల్లి తెర వేదికగా పడుతున్న పోటీలో ఎవరు గెలిస్తారో..ఎవరు ముందుకు సాగుతారో చూద్దాం.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus