మాటల మాంత్రికుడు త్రివిక్రమ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించాలన్నది యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్రీమ్. నందమూరి అభిమానులు సైతం వీరి కాంబినేషన్లో సినిమా రావాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. కానీ తారక్, త్రివిక్రమ్ తమతమ ప్రాజక్ట్స్ లో బిజీగా ఉండడం వల్ల అది కుదరలేదు. జనతాగ్యారేజ్ తర్వాత త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ మూవీ చేయాలనుకున్నారు. త్రివిక్రమ్ కి పవన్ కళ్యాణ్ తో సినిమా ఉండడంతో బాబీ తో కలిసి ప్రాజక్ట్ పట్టాలెక్కించారు. బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సెప్టెంబర్ 1 న రిలీజ్ చేయాలనీ నిర్మాత కళ్యాణ్ రామ్ అనుకుంటున్నారు. ఇక త్రివిక్రమ్, పవన్ మూవీని అప్పటి లోపున కంప్లీట్ చేయాలనీ శ్రమిస్తున్నారు.
ఆ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి స్క్రిప్ట్ ని ఓ కొలిక్కి తెచ్చి నవంబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టాలని ఫిక్స్ అయినట్లు తెలిసింది. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధా కృష్ణ నిర్మించనున్న ఈ సినిమాని ఐదు నెలల్లో పూర్తి చేసి వేసవి సెలవుల్లో విడుదల చేయాలనుకుంటున్నారని సమాచారం. మరి ఈ అరుదైన కాంబినేషన్ ఎన్ని రికార్డులను కొల్లగొడుతుందో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.