నందమూరి బాలకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా మొదలెట్టిన “ఎన్టీఆర్” బయోపిక్ కి ఆది నుంచి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. తోలుదా కథ సెట్ అవ్వక కొన్నాళ్లపాటు ఆగాల్సి వస్తే.. ఆ తర్వాత దర్శకుడు తేజ వైదొలగడంతో ప్రొజెక్ట్ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే.. బాలకృష్ణ రంగంలోకి దిగి డైరెక్టర్ గా క్రిష్ ను టీం లోకి తీసుకొచ్చేసరికి అన్నీ మెలమెల్లగా సెట్ అవుతూ వచ్చాయి. స్క్రిప్ట్ వర్క్ అండ్ ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా ఊపందుకొంది. ఆల్రెడీ విద్యాబాలన్ కి బసవతారకం వెర్షన్ ను ఎక్స్ ప్లేన్ చేయడం కూడా జరిగిపోయిందట.
ఈ సినిమా షూటింగులో జాయిన్ కావడానికి ఆమె ముంబై నుంచి హైదరాబాద్ వచ్చారు. ముందుగా ఆమెకి సంబంధించిన పోర్షన్ ను చిత్రీకరించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ రాజకీయాల పరంగా బిజీగా వున్నారు. అందువలన ఈ ఇద్దరి కాంబినేషన్లోని సన్నివేశాలను ఆ తరువాత షూట్ చేయనున్నారు. మొదటి నుంచి కూడా బరువైన పాత్రలను చేయడంలో విద్యాబాలన్ తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చారు. అందువలన ఆమె కారణంగా బసవతారకం పాత్రకు మరింత నిండుదనం వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.