హ్యాట్రిక్ హిట్ తో దూసుకుపోతోన్న ఎన్టీఆర్ జై లవకుశ తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. బాబీ దర్శకత్వంలో తారక్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా 150 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ సినిమా కోసం, బిగ్ బాస్ కోసం కస్టపడి అలసిపోయిన ఎన్టీఆర్ భార్య, కొడుకుతో కలిసి విదేశీ టూర్ కి పయనమయ్యారు. తిరిగి వచ్చిన తర్వాత నెక్స్ట్ సినిమా పనుల్లో దిగనున్నట్లు అందరూ అనుకున్నారు. కానీ అలా జరగడం లేదు. కారణం త్రివిక్రమ్ కి ఖాళీ లేకపోవడమే. ఎన్టీఆర్ తర్వాత సినిమా మాటల మాంత్రికుడితోనని అందరికీ తెలిసిందే. అతను ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నారు.
ఈ సినిమా పనుల్లో జనవరి వరకు బిజీగా ఉండనున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని తారక్ మూవీ స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నం కానున్నారు. స్క్రిప్ట్ ఫైనల్ అయ్యేసరికి కనీసం మూడు నెలలు పడుతుందని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. సో హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధా కృష్ణ నిర్మించనున్న ఎన్టీఆర్ సినిమా మార్చి లోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అంటే ఐదు నెలలు వృథా కానున్నాయి. అందుకే ఎన్టీఆర్ నిర్ణయం మార్చుకున్నారు. ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలనీ భావిస్తున్నారు. అందుకోసం దిల్ రాజు ని కలిసి నట్టు టాక్. మరి దిల్ రాజు ఏ డైరక్టర్ ని సెట్ జేస్తాడో చూడాలి.