బిగ్ బాస్ షోతో టీవీలోకి అడుగు పెడుతున్న ఎన్టీఆర్

  • June 13, 2017 / 07:56 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లి తెరపై ఎంట్రీకి అంతా సిద్ధమైంది. కలర్స్ ఛానల్లో బాగా పాపులర్ అయిన బిగ్ బాస్ షోతో తారక్ టీవీలో హంగామా చేయడానికి వస్తున్నారు. స్టార్ మా ఛానల్ వాళ్లు తెలుగులో నిర్మిస్తున్న ఈ షోకి హోస్ట్ గా తారక్ వ్యవహరిస్తున్నారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన ఈ విషయాన్నీ అభిమానులు సైతం నమ్మలేదు. కానీ ఈ రోజు ఎన్టీఆర్ అధికారికంగా ఫొటోతో సహా పోస్ట్ చేసి ఖరారు చేసారు. బ్లాక్ సూట్ లో ఎన్టీఆర్ అదరగొడుతున్నారు. ఈ షో తో టీవీ రంగంలో రికార్డులను తిరగరాయడం గ్యారంటీ అని ఫ్యాన్స్ ధీమాగా చెబుతున్నారు.

త్వరలో ఈ షోలో పార్టిసిపెంట్స్ వివరాలను మా టీవీ వారు వెల్లడించనున్నారు. ఈ షో ఒక సీజన్ కి ఎన్టీఆర్ 7 కోట్లు అందుకోనున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు ఒక సీజన్ మొత్తానికి 4 కోట్లు అందుకున్నారు. ఇప్పటివరకు ఇదే అత్యధిక పారితోషికం. ఈ రికార్డును తారక్ బీట్ చేశారు. భారీ సెట్ తో, బడ్జెట్ తో నిర్మితంకానున్న ఈ కార్యక్రమం టీఆర్పీ రేటింగ్ లోను రికార్డులు సృష్టిస్తుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus