చెర్రీపై…ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెగేటివ్ కామెంట్స్!!!

  • December 5, 2016 / 06:23 AM IST

టాలీవుడ్ లో నందమూరి వంసాన్ని, మెగా వంశాన్ని అభిమానించే వారు…ఎక్కువ శాతం ఉంటారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే అదే క్రమంలో ఆ వంశం నుంచి వచ్చిన హీరోలకు ఫ్యాన్స్ తో పాటు యాంటీ ఫ్యాన్స్ కూడా ఉండడం సహజమే…ఇదిలా ఉంటే దాదాపుగా గత ముప్పై ఏళ్లుగా నందమూరి వర్సస్ మెగా అంటూ బాక్స్ ఆఫీస్ వద్ద ఫైట్ నడుస్తున్న విషయం తెలిసిందే….అయితే ఆది కాస్త ఇప్పుడు ముదిరి పాకాన పడినట్లు….ఆన్‌లైన్ లో హల్‌చల్ చేస్తున్నారు ఆ ఇరు హీరోల అభిమానులు…

ఇంతకీ విషయం ఏమిటంటే….నిన్న జరిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరన్ తేజ ‘ధృవ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ విషయంలో ఆన్‌లైన్ లో రగడ మొదలయింది…ఈ వేడుకలోని వేదిక పై పెట్టిన చరణ్ స్టిల్స్ పై కొందరు జూనియర్ వీరాభిమానులు సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టారు. రామ్ చరణ్ తన సిక్స్ ప్యాక్ బాడీతో షర్ట్ లేకుండా కనిపిస్తున్న స్టిల్ ను చూసి చరణ్ అభిమానులు జోష్ లోకి వెళ్లిపోతుంటే ఆ స్టిల్ పై జూనియర్ అభిమానులు ఒక విధమైన వింత కామెంట్స్ మొదలు పెట్టారు. కండలు తిరిగిన శరీరంతో చరణ్ ఒక బీచ్ పక్కన జీన్ ప్యాంట్ వేసుకుని నడుస్తున్న స్టిల్ చూస్తూ ఉంటె ‘టెంపర్’ సినిమాలో ఇటువంటి సిక్స్ ప్యాక్ తో షర్టు లేకుండా జూనియర్ కూడ జీన్ ప్యాంట్ తో బీచ్ పక్కన నడుస్తూ వెళ్ళిన సీన్ గుర్తుకు వస్తోంది అంటూ ‘టెంపర్’ సినిమాలోని ఆ సీన్ ను అంత ఘోరంగా చరణ్ కాపీ కొడితే ఎలా అంటూ జూనియర్ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

అంతేకాదు చరణ్ జూనియర్లు ఎంత స్నేహితులైనా అంత ఘోరంగా చరణ్ జూనియర్ ను అనుసరిస్తాడా ? అంటూ సెటైర్లు వేస్తున్నారు జూనియర్ ఫ్యాన్స్. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం చెర్రీపై తమ అభిమానాన్ని చూపిస్తూ… ‘ధృవ’ టైటిల్ సాంగ్ మేకింగ్ వీడియోలో చరణ్ పడ్డ కష్టం అంతా కనిపించింది అంటూ ఆ స్థాయిలో బాడీ బిల్డ్ చేయడం ఒక చరణ్ కే సాధ్యం అంటూ చరణ్ ను వెనకేసుకు వస్తున్నారు…మొత్తానికి మెగా-నందమూరి ఫ్యాన్స్ తో ఆన్‌లైన్ వార్ మళ్లీ మొదలైనట్లే!!!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus