బిగ్ బాస్ కి ఎన్టీఆర్ పారితోషికం ఎంతో తెలుసా ?

  • July 10, 2017 / 09:23 AM IST

స్టార్ మా ఛానల్ వాళ్లు నిర్మిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో బజ్ మొదలయిపోయింది. జులై 16 నుంచి 70  రోజుల పాటు ప్రసారం కానున్న ఈ షో లో హోస్ట్ గా ఎన్టీఆర్ పాల్గొంటుండడంతో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. తారక్ తొలి సారి చేస్తున్న టీవీ షో టీఆర్పీ లో రికార్డ్స్ సృష్టిస్తుందని అభిమానులు చెబుతున్నారు. ఈ షో గురించి మరో టాపిక్ ట్రెండ్ అవుతోంది. ఈ షో కోసం ఎన్టీఆర్ పారితోషికం అందుకుంటున్నారు? అని అందరూ చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్నీ మొన్న జరిగిన మీడియా సమావేశంలో రిపోర్టర్లు ఎన్టీఆర్ ని అడగగా ..  “మీడియా ఊహించుకున్నంత ఎమౌంట్ మాత్రం తీసుకోవట్లేదు. కానీ నేను తృప్తి చెందేంత డబ్బు మాత్రం నాకిచ్చారు” అని తారక్ అమౌంట్ చెప్పకుండా తప్పించుకున్నారు.

దానిపై ఆరా తీయగా అసలు విషయం బయట పడింది. బిగ్ బాస్ తెలుగు తొలి సీజన్ లో 12 ఎపిసోడ్లలో ఎన్టీఆర్ కనిపిస్తారంట. ఒక ఎపిసోడ్ కి 50 లక్షలు తీసుకుంటున్నట్లు తెలిసింది. అంటే ఈ సీజన్ కు ఎన్టీఆర్ 6 కోట్లు అందుకుని రికార్డ్ సృష్టించారు. ఇంత మొత్తాన్ని అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి కూడా అందుకోకపోవడం విశేషం.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus