బాలయ్య సినిమా ఎన్టీఆర్ చేయలనుకున్నారట!

  • April 9, 2016 / 10:40 AM IST

కొత్త సంవత్సరం ఉగాది నాడు బాలయ్య తన 100వ సినిమా ప్రకటన చేశారు. నూతన రాజధాని అమరావతిలో ఈ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ముందుగా చెప్పినట్లే..  క్రిష్‌ దర్శకత్వంలో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించారు. గౌతమి పుత్ర శాతకర్ణి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నామని, గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రను నాన్న ఎన్టీఆర్‌ తీయాలనుకున్నారని, అయితే కొన్ని కారణాలతో అది కుదరలేదని అన్నారు. ఇప్పుడు అదే సినిమా తన 100వ సినిమా అవ్వడం సంతోషంగా ఉందని.. తెలుగువారు తప్పకుండా తెలుసుకోవాల్సిన చరిత్ర గౌతమి పుత్ర శాతకర్ణి అని వెల్లడించారు బాలయ్య.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus