చొక్కాలు మార్చేసి కనిపిస్తే కనీసం హీరోల అభిమానులు కూడా కనికరించడం లేదు. అందుకే హీరోలు తాము నటించే ప్రతి సినిమాలో డిఫరెంట్ గెటప్ లో కనిపించేందుకు తెగ కష్టపడిపోతున్నారు. అయితే.. ఎన్టీయార్ మాత్రం తన కెరీర్ లో ఇప్పటివరకూ కష్టపడనంతగా త్రివిక్రమ్ సినిమా కోసం చెమటోడుస్తున్నాడు. ఒక ఫారిన్ ట్రైనర్ ను పెట్టుకొని గత కొన్ని నెలలుగా జిమ్ కి పరిమితమైపోయిన ఎన్టీయార్ ఇప్పటివరకూ 12 కేజీల బరువు తగ్గాడట. ఇటీవల సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన ఎన్టీయార్ జిమ్ చేస్తున్న ఫోటో చూస్తేనే ఈ విషయం తెలిసిపోతుంది.
సిక్స్ ప్యాక్ లుక్ మాత్రమే కాక పర్ఫెక్ట్ టోన్డ్ బాడీతో ఎన్టీయార్ ఈ చిత్రంలో కనిపించనున్నాడు. త్రివిక్రమ్ కూడా “అజ్ణాతవాసి” విషయంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ కొత్త సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడట. త్రివిక్రమ్ మేటర్ పక్కన పెడితే.. ఎన్టీయార్ లుక్ మాత్రం సినిమాకి హైలైట్ అవ్వనుంది. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో నటించనున్నాడు ఎన్టీయార్.