ఎన్టీఆర్ 27 మూవీలో ఒక పాత్ర ఇలా ఉంటుందంట

  • March 10, 2017 / 01:37 PM IST

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న సినిమా కోసం తారక్ చాలా శ్రమిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో మెప్పించనున్నారు. జై లవ కుశ అనే టైటిల్ అనుకుంటున్నా ఈ మూవీలో తండ్రిగా ఇద్దరు కొడుకులుగా తారక్ కనిపించనున్నారు. కొడుకుల్లో ఇద్దరూ భిన్న మనస్తత్వం కలవారని, ఒకరు మాస్ గా గడ్డంతో ఉంటే, మరొకరు ఫిట్ బాడీతో స్టైల్ గా ఉంటారని తెలిసింది. స్టైల్ క్యారక్టర్ కోసం తారక్ ఏకంగా 12 కిలోల బరువు తగ్గనున్నారు.

యమదొంగలో స్లిమ్ గా కనిపించిన తారక్ ఇప్పుడు ఈ చిత్రం కోసం మరో సారి బరువు తగ్గుతున్నారు. బాలీవుడ్ ప్రముఖ కెమెరామెన్ సీ కే మురళీధరన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ మూవీ టీమ్ లో హాలీవుడ్ లెగసీ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ వాన్సీ హార్ట్ వెల్ కూడా ఉన్నారు. ఈ ఫిల్మ్ కి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus