ఎన్టీఆర్ షూటింగ్ ఫోటోలు లీక్

  • April 3, 2017 / 09:53 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మాస్ లోనే కాదు.. క్లాస్ లోను అధిక సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే అతని గురించి సోషల్ మీడియాలో రోజూ ఏదొక న్యూస్ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. తారక్ గురించి చిన్న విషయం బయటికివచ్చినా అది విపరీతంగా షేర్లు అందుకుంటాయి. ఇప్పుడు అదే జరిగింది. ఈ రోజు ఎన్టీఆర్ షూటింగ్ లొకేషన్లో ఉన్న ఫోటోలు బయటికి వచ్చాయి. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీకి సంబంధించినవని జోరుగా ప్రచారం సాగింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న జై లవ కుశ ఫిల్మ్ షూటింగ్ ఫోటోలు ఎలా లీక్ అయ్యాయని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.

అది సినిమాకి సంభందించి ఫోటోలు కాదని తెలిసింది. ప్రముఖ కంపెనీ నవరత్న ఆయిల్ కి చెందిన వాణిజ్య ప్రకటన కోసం ఈరోజు ఫోటో షూట్ లో జరిగిందని, అందులో తారక్ పాల్గొన్న ఫోటోలు లీక్ అయినట్లు స్పష్టమయింది. వాణిజ్య ప్రకటన అయినా ఎన్టీఆర్ లుక్ సూపర్ అని అభిమానులు ఆనందపడుతున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus