బిగ్ బాస్ సీజన్ 2 ఫైనల్ కి గెస్ట్ గా వెళ్లనున్న నాగార్జున!

  • September 12, 2018 / 09:37 AM IST

ఏమైనా జరగొచ్చు అనే ట్యాగ్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 2 షో.. అంతే విశేషాలలతో సాగుతోంది. స్టార్ మా ఛానల్ ల్లో 92 రోజులుగా తెలుగు రాష్ట్రాల బుల్లి తెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. నేచురల్ స్టార్ నాని యాంకరింగ్ తో పాటు పార్టిసిపెంట్స్ మధ్య అనుబంధాలు, గొడవలు, టాస్క్ లు షో రేటింగ్ ని పెంచుతున్నారు. వచ్చేవారం ఈ షో కి ఫైనల్ జరగనుంది. విన్నర్ ని ప్రకటించనున్నారు. ఈ వేడుకకి ముఖ్య అతిధిగా సీజన్ వన్ హోస్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఆహ్వానించారు. అయితే తారక్ రావడానికి నో చెప్పినట్లు తెలిసింది. తన తండ్రి మరణంతో బాధలో ఉన్న అతను షోలో పాల్గొనలేనని చెప్పినట్లు తెలిసింది.

అంతేకాకుండా అరవింద సమేత సినిమాని తొందరగా కంప్లీట్ చేయాలనీ ఆలోచనలో ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించినట్టు ఫిలింనగర్ వాసులు చెప్పారు. ఇక స్టార్ మాటీవీ వారికి బాగా సన్నిహితులైన కింగ్ అక్కినేని నాగార్జునని ఆహ్వానించారు. అందుకు నాగ్ ఒకే చెప్పినట్టు తెలిసింది. నాని, నాగార్జున కలిసి దేవదాస్ మల్టీ స్టారర్ మూవీ చేశారు. ఆ చిత్రం ఈనెల 27న రిలీజ‌వుతోంది. సో వీరిద్దరూ బిగ్ బాస్ వేదికపై హంగామా చేయనున్నారు. బుల్లితెర వీక్షకులను ఎంటర్టైన్ చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus