పౌరాణిక పాత్రలో ఎన్టీఆర్!

  • February 4, 2017 / 11:15 AM IST

మహానటుడు నందమూరి తారక రామారావు పౌరణిక పాత్రలతో తెలుగు వారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. కృష్ణుడిగా, రాముడిగానే కాకుండా నెగెటివ్ రోల్స్ అయిన రావణాసురుడు, దుర్యోధనుడి పాత్రల్లోనూ మెప్పించారు. అటువంటి ప్రాతలు చేయాలని ఎప్పటినుంచో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలలు కంటున్నారు. చిన్నప్పుడు రాముడిగా బాలరామాయణంలో తారక్ నటించారు. ఆ చిత్రాన్ని డైరక్ట్ చేసిన గుణశేఖర్ ఇప్పుడు ఎన్టీఆర్ కోసం పౌరాణిక కథను రాస్తున్నారు.

రుద్రమదేవి సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన ఈ డైరక్టర్ పౌరాణిక గాథకు దృశ్యరూపం ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. హిరణ్యకశ్యప పేరుతో సినిమాను రూపొందించేందుకు శ్రమిస్తున్నారు. ఈ సినిమాలో  హిరణ్యకశ్యపుడిగా ఎన్టీఆర్ ను నటింప చేయాలని అనుకుంటున్నారు. స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ కథను త్వరలో ఎన్టీఆర్ కి వినిపించనున్నారు. ఆయన ఒకే అంటే భారీ సెట్టింగ్ లతో మరో వెండితెర కళాఖండం సిద్ధం కావడం గ్యారంటీ.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus