నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తూనే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో సినిమాలు నిర్మిస్తున్నారు. అందులో కొన్ని విజయం సాధించగా, మరికొన్ని మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. ఓం, కిక్ చిత్రాలు ఆర్ధికంగా నష్టాన్ని మిగిల్చాయి. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరో గా నటిస్తూ, నిర్మిస్తున్న “ఇజం” చిత్రం కోసం భారీ బడ్జెట్ ని వెచ్చించారు. తన ఇమేజ్ కి మించి ఖర్చు చేసినట్లు సమాచారం. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ త్వరలో విడుడల కానుంది.
ఇలా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న అన్న కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అడుగు ముందుకు వేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో సినిమా చేసేందుకు ఓకే తెలిపారు. ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ కోసం తారక్ రంగంలో దిగారు. సిక్స్ ప్యాక్ కోసం కసరత్తు ప్రారంభించారు. టెంపర్ లో సిక్స్ ప్యాక్ తో కనిపించిన ఎన్టీఆర్ మళ్లీ ఈ మూవీ కోసం ట్రై చేస్తున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత తారక్ చేస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి.