బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన సినిమా 27. మాటల మాంత్రికుడు త్రివిక్రమ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్న సినిమా సంఖ్య 28. మరి ఈ 18 తో లింకు ఏమిటి? అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే .. జై లవకుశ తర్వాత తారక్ చేయనున్న సినిమాకి రీసెంట్ గా పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమాని రిలీజ్ చేసే పనిలో ఉంటే.. ఎన్టీఆర్ మాత్రం త్రివిక్రమ్ చెప్పినట్టు చేయడానికి కసరత్తు మొదలెట్టారు. బరువు తగ్గడానికి డైట్ ప్రారంభించేసారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 18 కిలోల బరువు తగ్గి టీనేజీ కుర్రోడిలా మారబోతున్నారు. గతంలోనూ యమదొంగ, కంత్రి మూవీ సమయంలో పాతిక కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు కూడా అలాగే బరువు తగ్గాలని ఫిక్స్ అయ్యారు.
ఇందుకు ముంబయి న్యూట్రిషన్ తో సలహాలు తీసుకొని, నిపుణులు చెప్పినట్లుగా డైట్ ఫాలో అవుతున్నారు. అంతేకాదు చాలా గ్లామర్ గా కనిపించడానికి విదేశీ స్టైలిష్ ని నియమించినట్లు సమాచారం. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మించనున్నఎన్టీఆర్ 28 వ సినిమా ఫిబ్రవరి లో సెట్స్ మీదకు వెళ్లనుంది. తొలిసారి త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మెగా హీరోలతో ఎక్కువగా సినిమాలు చేసి మెగా దర్శకుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ తొలిసారి నందమూరి హీరోని డైరక్ట్ చేయబోతున్నారు. మరి ఎన్టీఆర్ ని ఎలా చూపించబోతున్నారు? అని నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.