మేలో మరో బుడ్డోడి కోసం ఎన్టీయార్ వెయిటింగ్!

  • February 19, 2018 / 10:39 AM IST

ప్రస్తుతం తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాపీయస్ట్ మాత్రమే కాదు మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరో ఎవరంటే ఎవరికైనా గుర్తొచ్చే పేరు “జూనియర్ ఎన్టీయార్”. “నాన్నకు ప్రేమతో” మొదలుకొని “జై లవకుశ” వరకూ వరుస సక్సెస్ లతో దూకుపోతున్న ఎన్టీయార్.. “బిగ్ బాస్” షోతో బుల్లితెర ప్రేక్షకులనూ అభిమానులుగా మార్చేసుకొన్నాడు. ప్రస్తుతం మార్చి నుంచి మొదలవ్వనున్న త్రివిక్రమ్ సినిమా కోసం తనని తాని సరికొత్తగా మలచుకొంటున్న ఎన్టీయార్ ఇంట్లో మరో ఆనందకరమైన విషయం చోటు చేసుకోనుంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎన్టీయార్ సతీమణి లక్ష్మీ ప్రణతి రెండోసారి గర్భవతి అయ్యిందట. అందుకే ఎన్టీయార్ బిడ్డ పుట్టేవరకూ ఇంట్లోనే ఉంటున్నాడట. ఇక ఎన్టీయార్ తల్లిగారైతే పుట్టబోయే బిడ్డ కోసం ప్రత్యేక పూజలు కూడా చేయిస్తోందట. మే లేదా ఏప్రిల్ కల్లా బిడ్డ పుట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సో, జూనియర్ ఎన్టీయార్ తోపాటి ఆయన అభిమానులు కూడా ఇప్పట్నుంచే పుట్టబోయే బిడ్డ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీయార్ కథానాయకుడిగా తెరకెక్కనున్న చిత్రానికి తమన్ సంగీత దర్శకుడిగా ఫిక్స్ అయ్యాడు. అలాగే హీరోయిన్ గా పలువురి పేర్లు పరిశీలనలో ఉండగా.. త్వరలోనే త్రివిక్రమ్ అఫీషియల్ గా హీరోయిన్ ఎవరనేది ప్రకటించనున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus