భారీ ధర పలికిన ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ యూఎస్ థియేట్రికల్ రైట్స్

  • May 18, 2018 / 11:28 AM IST

వరుసగా నాలుగు హిట్స్ అందుకోవడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి మార్కెట్ లో మంచి వ్యాల్యూ ఉంది. పైగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్ర రైట్స్ కొనుగోలు చేయడానికి ఇప్పటి నుంచే సంప్రదింపులు చేస్తున్నారు.  హైదరాబాద్ శివారులలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. నాలుగు కోట్లతో  వేసిన రాయలసీమలోని ఒక గ్రామానికి చెందిన సెట్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా “అసామాన్యుడు” అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.

ఇంకా టైటిల్ కూడా ఖరారు కాకముందే యూఎస్ హక్కులు విక్రయించినట్లు తెలిసింది. నిర్మాత రాధాకృష్ణ .. ఎన్టీఆర్ సినిమాతో పాటు తమ బ్యానర్లో రూపొందుతోన్న ‘శైలజా రెడ్డి అల్లుడు’ .. సుధీర్ వర్మతో శర్వానంద్ చేస్తోన్న సినిమాలను కలిపి ఒక ప్యాకేజ్ గా అమ్మారని సమాచారం. ఈ మూడు సినిమాలకి గాను యూఎస్ హక్కులకు 18 కోట్లు ఒప్పదం కుదిరినట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. ఒక్క ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ సినిమా కే 12 కోట్లు ఇస్తున్నట్లు తెలిసింది. జిగేల్ రాణి పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్. థమన్ సంగీతమందిస్తున్నారు. జగపతిబాబు విలన్ గా నటిస్తున్న ఈ మూవీ  అక్టోబర్ లో థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus