NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

ఎన్టీఆర్- త్రివిక్రమ్ కలయిక ‘అరవింద సమేత’ అనే సినిమా వచ్చింది. బాక్సాఫీస్ వద్ద అది సూపర్ హిట్ ఫలితాన్ని అందుకుంది. ఆ తర్వాత వీరిద్దరి కలయికలో మరో సినిమా రూపొందనున్నట్టు ప్రచారం జరిగింది. ఇటీవల అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఎన్టీఆర్- త్రివిక్రమ్(NTRxTrivikram) కలయికలో ఓ భారీ బడ్జెట్, పాన్ ఇండియా సినిమా రూపొందనుంది. అది మైథాలజీ మూవీ అనే చర్చ కూడా అనౌన్స్మెంట్..కి ముందు గట్టిగా జరిగింది.

NTRxTrivikram

దానిపై కూడా కాన్సెప్ట్ పోస్టర్ తో క్లారిటీ ఇచ్చింది చిత్ర బృందం. మైథాలజీకి సైన్స్ ను మిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను వదిలింది. ఇది సుబ్రహ్మణ్య స్వామి జీవితాన్ని ఆధారం చేసుకుని రాసుకున్న కథ అని కూడా రివీల్ చేశారు. తమిళనాడులో మురుగన్ గా సుబ్రహ్మణ్యస్వామిని కొలుస్తుంటారు. దీంతో ఇది తమిళ దేవుడి సినిమా అనే వివాదానికి కూడా దారితీసినట్టు అయ్యింది. అలాగే అల్మోస్ట్ మురుగన్ కాన్సెప్ట్ తో ధనుష్- వెట్రిమారన్ కలయికలో కూడా ఒక సినిమా రూపొందనున్నట్టు అక్కడి మేకర్స్ ప్రకటించారు.

ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకి కళ్యాణ్ రామ్ కూడా ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ పై సమర్పకుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ 2 టైటిల్స్ ని ఇటీవల రెజిస్టర్ చేయించినట్టు టాక్. అందులో ఒకటి ‘గాడ్ ఆఫ్ వార్’ కాగా.. రెండోది ‘దేవసేనాపతి’. ఈ 2 టైటిల్స్ ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమా కోసమేనేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమాకి మొదటి నుండి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

అది చాలా ఫాస్ట్ గా జనాల్లోకి వెళ్ళిపోయింది. సో అల్మోస్ట్ అదే టైటిల్ ని కన్ఫర్మ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘దేవసేనాపతి’ అనేది కూడా పవర్ఫుల్ టైటిల్. కాకపోతే ఇది కళ్యాణ్ రామ్ సినిమా కోసం రెజిస్టర్ చేయించినట్టు టాక్ నడుస్తుంది. చూడాలి మరి ఫైనల్ గా ఏ టైటిల్ ను కన్ఫర్మ్ చేస్తారో..!

కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus