తారక్ పేరును పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది?

  • December 21, 2017 / 01:44 PM IST

మెగా హీరోలు, నందమూరి హీరోల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది. ఒకరికి మించి మరొకరు హిట్ కొట్టాలని కష్టపడుతుంటారు. ఒకరి రికార్డును మరొకరు బద్దలు కొట్టాలని భావిస్తుంటారు. ముఖ్యంగా ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ మధ్య మంచి పోటీ ఉంది. అలాంటప్పుడు ఎన్టీఆర్ పేరును పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకున్నారు? అనే సందేహం తప్పకుండా వస్తుంది. అసలు విషయంలోకి వెళితే .. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి సినిమా చేశారు. అను ఇమ్యానుయేల్, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ జనవరి 10 న రిలీజ్ కాబోతోంది. టీజర్ తో సంచలనం సృష్టించిన ఈ చిత్రంలో పవన్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా అతని రోల్ పేరుకూడా బయటికి వచ్చింది.

లీకైన డైలాగుల ప్రకారం పవన్ పేరు అభిజిత్ అనే తెలుస్తుంది. ఈ పేరు పవన్ ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. అయితే యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఎన్టీఆర్ పేరులో సగం పేరును పవన్ తీసుకున్నారని ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ పాత్ర  పేరు అభిరామ్. దీంతో మా హీరో పేరులోని సగం కొట్టేశారని పవన్ ఫ్యాన్స్‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు. జల్సా, అత్తారింటికి దారేది కాంబినేషన్లో వస్తున్న అజ్ఞాతవాసిపై భారీ అంచనాలు ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus