మరోసారి మంచి మనసు చాటుకున్న ఎన్టీఆర్!

  • November 3, 2017 / 01:48 PM IST

“ఎక్కడ నెగ్గాలో కాదురా.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు”.. త్రివిక్రమ్ కలం నుంచి వచ్చిన అద్భుతమైన డైలాగ్ ఇది. ఇప్పుడు ఈ డైలాగ్ గురించి ఎందుకు ప్రస్తావించమంటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. వెనక్కి తగ్గి మరోసారి గొప్పోడు అనిపించుకున్నారు. జై లవకుశ చిత్రం తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు పవన్ కళ్యాణ్ సినిమా పనుల్లో బిజీగా ఉంటూనే డైరక్టర్, ఎన్టీఆర్ తో స్టోరీ చర్చల్లో పాల్గొంటున్నారు. ఇందులో బడ్జెట్ విషయం కూడా చర్చకి వచ్చినట్లు సమాచారం. సినిమా కోసం భారీ సెట్స్ ప్లాన్ చేశారు. అలాగే ఇదివరకు వెండితెరపై కనిపించని లొకేషన్లలో షూట్ చేయాలనీ అనుకుంటున్నారు. అందుకే బడ్జెట్ పెరుగుతుంది కాబట్టి.. నిర్మాత రాధా కృష్ణ అడక్కముందే తన రెమ్యునరేషన్ తగ్గించుకుంటానని ఎన్టీఆర్ ముందుకు వచ్చినట్లు తెలిసింది.

Click Here For Review

ఈ వార్త  బయటికి రాగానే ఫిలిం నగర్ వర్గాల్లో ఎక్కడ చూసిన తారక్ గురించే మాట్లాడుకుంటున్నారు. యువ హీరోలు సైతం సినిమాకి సినిమాకి రెమ్యునరేషన్ పెంచుకుంటున్న ఈ కాలంలో వరుసగా 4  హిట్లు అందుకున్న కూడా రెమ్యునరేషన్ తగ్గించుకోవడం గొప్ప విషయమని అభినందిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ చిత్రం మార్చిలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus