యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి, అలాగే తన టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో చరణ్ తో కలిసి ‘ఆర్.ఆర్.ఆర్’ అనే భారీ మల్టీ స్టారర్ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటివరకూ తారక్ కేవలం తన సినిమాలు యాడ్స్ లో నటించడం తప్ప ఇంతవరకూ బిజినెస్ వైపు దృష్టి పెట్టలేదు. ఇక ఏడాదికి ఒక సినిమా చేయడమే కష్టంగా ఉన్న తరుణంలో… ఆదాయాన్ని పెంచుకోవాలని ఇటీవల కొంత మంది హీరోల దగ్గర్నుండీ ఐడియాలను తీసుకున్నాడట.
దీంతో లైఫ్ లాంగ్ ఉండే బిజినెస్ బెటర్ అనే ఉద్దేశంతో మల్టిప్లెక్స్ లను మొదలెట్టడానికి తారక్ సిద్దమయ్యాడట. ఇటీవల మహేష్ ‘ఏషియన్ సినిమాస్’ తో కలిసి ఏ.ఎం.బి సినిమాస్ ను రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే తరహాలో తారక్ కూడా ‘ఏషియన్ సినిమాస్’ తో కలిసి ఆంధ్రప్రదేశ్ లో మల్టిప్లెక్స్ లను నిర్మించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడట. ఈ నేపథ్యంలో ముందుగా అమరావతి లేక విశాఖపట్నంలో ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ ను మొదలుపెట్టబోతున్నాడట. ప్రస్తుతం గవర్నమెంట్ అప్రూవల్ కోసం ఎదురుచూస్తున్నాడట. ఇక ఒక్కసారి అప్రూవల్ వచ్చేస్తే పనులు మొదలుపెట్టాలని తారక్ అండ్ టీం రెడీగా ఉన్నారట.