ఆ పాత్రకోసమే బాడీని మలుచుకుంటున్న ఎన్టీఆర్

  • February 26, 2018 / 05:55 AM IST

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న సినిమా గురించి రోజుకో ఆసక్తికర న్యూస్ బయటికి వస్తోంది. మొన్నటి వరకు ఇది ఒక కుటుంబ కథ చిత్రమని, యాక్షన్స్ కన్నా.. ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పుకుంటూ వచ్చారు. కానీ తాజాగా ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం… యాక్షన్ ఎక్కువగా ఉంటుందని తెల్సింది. ఇందులో ఎన్టీఆర్ ఒక ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టు టాక్. గతంలో మహానటుడు ఎన్టీఆర్ సోల్జెర్ గా నటించి సూపర్ హిట్ అందుకున్నారు. అదే తరహాలో ఆయన మనవడు తారక్ సైనికాధికారిగా అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నారు.

అందుకోసమే బాలీవుడ్ ఫిట్ నెస్ ట్రైనర్ ఆధ్వర్యంలో బాడీని మలుచుకుంటున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే, శ్రద్ధ కపూర్ లు నటించనున్నారు. అలాగే మరో కీలక పాత్రలో నటింపచేసేందుకు అలనాటి హీరోయిన్స్ లయ, సిమ్రాన్, మీనాలను సంప్రదిస్తున్నారు. వీరిలో ఎవరు ఓకే చెబుతారో త్వరలో తెలియనుంది. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించనున్న ఈ సినిమాకు వినోద్ కెమెరా మెన్ గా ఫిక్స్ అయ్యారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి మూడో వారంలో సెట్స్ పైకి వెళ్లనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus