కొమరం భీమ్ పోరాటం షురూ..!

  • June 4, 2019 / 06:50 PM IST

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ రాంచరణ్ .. ఎన్టీఆర్ కు గాయాలవ్వడంతో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా హైదరాబాద్ లో తిరిగి షూటింగ్ మొదలైందట. ఇటీవలే ఎన్టీఆర్ పై ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను కూడా చిత్రీకరించారని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో చరణ్.. అల్లూరి సీతారామరాజుగా అలాగే ఈ ఎన్టీఆర్ కొమరమ్ భీమ్ గా నటిస్తున్నాడు.

ఎన్టీఆర్ బ్రిటీష్ సైన్యంతో తలపడే సన్నివేశాలను భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారట. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ చిత్రానికే హైలైట్ గా నిలుస్తాయట. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. చరణ్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుంది.. ! అజయ్ దేవగణ్ .. సముద్రఖని కూడా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 30న 2020లో విడుదల చేయబోతున్నట్టు ఇదివరకే ప్రకటించారు చిత్ర యూనిట్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus