ఒకేవారంలో మూడు నాలుగు సినిమాలు, కుదిరితే అయిదారు సినిమాలు విడుదలకు పోటీపడుతున్న ఈ తరుణంలో.. పెద్ద సినిమాలకు తప్ప, సోలో రిలీజ్ అనేది మరెవరికీ సాధ్యమవ్వడం లేదు. కానీ.. అనుకోకుండా తనకి దొరికిన సోలో రిలీజ్ ను సరిగా వాడుకోలేకపోతున్నాడు దర్శకుడు ఓంకార్. “రాజుగారి గది” సిరీస్ లో మూడో భాగమైన “రాజుగారి గది 3” ఈ శుక్రవారం (అక్టోబర్ 18) విడుదలవుతోంది. ఓంకార్ తమ్ముడు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో “సినిమా చూపిస్త మావ” ఫేమ్ ఆవికా గోర్ కథానాయికగా నటించింది.
హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం సోలో రిలీజ్ ను దక్కించుకొంది. అయితే.. సినిమాకి బేసిక్ హైప్ కానీ, పబ్లిసిటీ కానీ లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. దసరా & దీపావళి సీజన్ అయ్యుండి.. లాంగ్ వీకెండ్ కూడా కలిసొచ్చినా కూడా ఓంకార్ ఎందుకో “రాజుగారి గది 3″కి హైప్ తీసుకురాలేకపోయాడు. తమన్నా సినిమా నుంచి తప్పుకొన్న తర్వాత ఆమె స్థానంలో మరో కథానాయికను తీసుకోవడంలోనే తప్పు చేసిన ఓంకార్.. ఇప్పుడు ఈ సోలో రిలీజ్ ను కూడా సరిగా యూటిలైజ్ చేసుకోకపోతుండడం గమనార్హం. ఈ మూడో భాగానికి డబ్బులు రావాలంటే.. రిలీజయ్యాక పాజిటివ్ టాక్ తోపాటు సోషల్ మీడియా సపోర్ట్ కూడా కావాల్సిందే.
బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?