జూన్ లో ‘ఒకమనసు’..?

  • May 2, 2016 / 11:46 AM IST

మెగా ప్రిన్సెస్ గా వెండి తెరకు పరిచయం అవుతూ నిహారిక నటిస్తున్న చిత్రం ఒక మనసు, రామ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగశౌర్య సరసన జంటగా నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ను మే రెండవ వారంలో విడుదల చేయనుండగా.. ఈ చిత్రాన్ని జూన్ 3 న లేదా 10 న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. మధుర శ్రీధర్, టి‌వి 9 లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus