బాలయ్య 105 వ చిత్రం బోయపాటితోనే..!

  • December 14, 2018 / 12:43 PM IST

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘ఎన్టీఆర్’ బయోపిక్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రెండు పార్థులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘ఎన్టీఆర్ – కధానాయకుడు’ సంక్రాంతి కానుకగా అలాగే ‘ఎన్టీఆర్- మహానాయకుడు’ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇవి బాలకృష్ణ 103, 104 చిత్రాలు కావడం విశేషం. ఇక బాలకృష్ణ 105 వ చిత్రానికి సంబంధించి ఒక వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది.

బాలకృష్ణకు ‘సింహా’ ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్ చిత్రాలను ఇచ్చిన బోయపాటి శ్రీను డైరెక్షన్లో తన 105 వ చిత్రాన్ని లైన్లో పెట్టినట్టు సమాచారం. బాలాయ్య – బోయపాటి హ్యాట్రిక్ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో ప్రటించబోతున్నట్టు సమాచారం. విచిత్రం ఏంటంటే ప్రస్తుతం వీరిద్దరి చిత్రాలు 2019 సంక్రాంతి బరిలో పోటీపడనున్నాయి. బాలయ్య హీరోగా వస్తున్న ‘ఎన్టీఆర్’.. అలాగే బోయపాటి డైరెక్షన్లో వస్తున్న రాంచరణ్ ‘వినయ విధేయ రామ’ చిత్రాలు సంక్రాంతికే విడుదల కాబోతుండడం గమనార్హం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus