చిరకాల స్నేహితులు అర్జున్-జగపతిబాబుల కలయికలో

  • September 8, 2018 / 12:11 PM IST

ఇండస్ట్రీలోని క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్ లో అందరికీ ఇమ్మీడియట్ గా గుర్తొచ్చే పేరు అర్జున్-జగపతిబాబు. ఈ ఇద్దరు స్నేహితులు కలిసి సినిమాల్లో నటించడమే కాకుండా చాలా క్లోజ్ గా ఉంటూ సాటి ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కి ఫ్రెండ్ షిప్ గోల్స్ ఇస్తుంటారు. అలాంటి స్నేహితులిద్దరూ “హనుమాన్ జంక్షన్, శివకాశి” చిత్రాల తర్వాత కలిసి నటించలేదు. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు స్నేహితులు కలిసి నటించనున్నారు. తమిళంలో తెరకెక్కనున్న ఓ యాక్షన్ మల్టీస్టారర్ లో అర్జున్-జగపతిబాబు-జాకీ ష్రాఫ్ హీరోలుగా నటించనున్న ఈ చిత్రంలో మరో తమిళ స్టార్ కథానాయకుడు ముఖ్యపాత్ర పోషించనున్నాడట.

“లెజండ్” తర్వాత అన్నీ విలన్ లేదా క్యారెక్టర్ రోల్స్ మాత్రమే చేస్తూ వచ్చిన జగపతిబాబు చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ హీరోగా నటించనుండడంతో ఆయన్ను అభిమానించేవాళ్లు మాత్రమే కాక సాల్ట్ & పెప్పర్ లుక్ లో జగపతిబాబు నవతరం కథానాయకులకు కూడా గట్టిపోటీ ఇవ్వడం ఖాయమని సినిమా అభిమానులు కూడా భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus