పవన్ కళ్యాణ్ ని తీవ్రంగా విమర్శిస్తున్న కత్తి మహేష్!

  • December 8, 2017 / 06:53 AM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై సినీ విమర్శకుడు కత్తి మహేష్ మరో మారు తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కి ప్రథమ శత్రువుగా అతని మాటల్లోని తప్పులను సోషల్ మీడియా వేదికపై ఎత్తిచూపుతున్నారు. పవన్ ని గతంలోనూ విమర్శించి అభిమానులల్తో తీవ్రంగా వ్యతిరేకత ఎదుర్కొన్న కత్తి మహేష్ ఇలా మాట్లాడడం సంచలనానికి దారితీస్తోంది. అసలు విషయంలోకి వెళితే.. పవన్ కళ్యాణ్ తన అజ్ఞాతవాసి సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే జనంలోకి వచ్చారు. వైజాక్ లో పర్యటిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని తనదైన శైలిలో ప్రశ్నిస్తున్నారు. ఆయన వేదికలపై మాట్లాడిన ప్రతి అంశాన్ని విమర్శిస్తున్నారు కత్తి మహేష్. వాటిలో ఒక పోస్ట్ ప్రస్తుతము సొషల్ మీడియాలో వైరల్ అయింది. ‘‘నోరువిప్పిన ప్రతిసారీ అజ్ఞాతవాసి కాదు, అజ్ఞానవాసి అని తేలుతోంది.

అంతే!’’ అంటూ కత్తి మహేష్ చేసిన పోస్ట్ పవన్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. పవన్ ఫ్యాన్స్ కి కత్తి మహేష్ కి మధ్య వార్ మళ్ళీ మొదలైంది. “పవన్ ఫ్యాన్స్ నా వెంట పడ్డారు. అందుకే పవన్ వెంట నేను పడుతున్నాను” అని కత్తి మహేష్ తన పనిని సమర్ధించుకున్నారు. ఓ న్యూస్ ఛానెల్లో మాట్లాడుతూ “అజ్ఞాతవాసిని అజ్ఞానవాసి అని నేను అనడం వ్యక్తిగత విమర్శకాదు. ఆయన అజ్ఞానం గురించే నేను మాట్లాడుతున్నాను. అతను అజ్ఞాని కాదా? మేధావితనంతో మాట్లాడుతున్నాడా? ఏ విషయంలోను ఆయన మేధావితనంతో మాట్లాడలేదు. చర్చకు రమ్మనండి. అతని మేధావితనం ఏంటో నాకు తెలుస్తుంది” అని మహేష్ చెప్పారు. ఈ వివాదం ఎంత దూరం వెళుతుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus