మళ్ళీ మొదలైన నందమూరి మెగా వార్!

అప్పట్లో రాజకీయాల నేపధ్యంలో బాలకృష్ణను ఒక రిపోర్టర్ పవన్ కళ్యాణ్ పోలిటికల్ కామెంట్స్ గురించి రెస్పాన్స్ అడిగినప్పుడు బాలయ్య “పవన్ కళ్యాణ్ ఎవడో నాకు తెలియదు” అని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోయినా.. ఆయన ఫ్యాన్స్ మాత్రం కాస్త సీరియస్ గానే తీసుకొన్నారు. మరి ఆ సంఘటనకు ప్రతీకార చర్యా లేక మరింకేదైనా తెలియదు కానీ.. నిన్న నాగబాబు ఓ యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు బాలయ్య గురించి చెప్పండి అని అడగ్గా.. నాగబాబు చాలా సింపుల్ గా “బాలయ్య ఎవడో నాకు తెలియదు” అని చెప్పాడు.

పైగా.. సీనియర్ ఆర్టిస్ట్ బాలయ్య అయితే నాకు తెలుసు కానీ.. మరో బాలయ్య ఎవరో మాత్రం నాకు తెలియదు అని చెప్పడం సంచలనం అయ్యింది. దాంతో బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే కాక నందమూరి అభిమానులందరూ నాగబాబుని ట్రోల్ చేయడం మొదలెట్టారు. ముఖ్యంగా.. నందమూరి ఫ్యాన్స్ మరియు తెలుగు దేశం తమ్ముళ్ళు నాగబాబును దారుణంగా తిట్టడం మొదలెట్టారు. ఈ విషయమై బాలయ్య ఎలా రెస్పాండ్ అవుతాడో తెలియదు కానీ.. ఆయన అభిమానులు మాత్రం కోపంతో రగిలిపోతున్నారు. ఒకపక్క ఎన్టీఆర్-రామ్ చరణ్ కలిసి సినిమా చేస్తే ఇరు కుటుంబాల అభిమానులను ఒక తాటిపై తెచ్చేందుకు సన్నద్ధమవుతుంటే.. ఈ పెద్దలు ఇలా గొడవలు పెడుతుండడం ఏంటో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus