బొద్దుగుమ్మ మళ్ళీ సన్నబడింది!

  • June 12, 2018 / 12:40 PM IST

చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లుగా.. నిన్నమొన్నటివరకూ కాస్త బొద్దుగా కనిపించిన నిత్యామీనన్ రీసెంట్ గా ఒక మ్యాగజైన్ కోసం చేయించుకొన్న స్పెషల్ ఫోటోషూట్ లో కాస్త సన్నబడి మునుపటికంటే అందంగా కనిపిస్తోంది. మొదట్లో చాలా సన్నగా ఉండే నిత్యామీనన్ ఆ తర్వాత కాలంలో మెలమెల్లగా లావెక్కీంది. ఇక బాడీ మెయింటైనెన్స్ గురించి పట్టించుకోవడం మానేసిందో ఏమో కానీ.. నిత్యా సడన్ గా చాలా లవైపోయి ఇక హీరోయిన్ క్యారెక్టర్స్ చేయడం మానేస్తుందేమోననేంతలా తయారయ్యింది.

కట్ చేస్తే.. “అ!” సినిమాలో కాస్త బెటర్ గా కనిపించిన నిత్యామీనన్ ఇప్పుడు ఈ సరికొత్త ఫోటోషూట్ తో తనను తాను ఇంకాస్త అందంగా ప్రేక్షకలోకానికి పరిచయం చేసుకొంది. ప్రస్తుతం నిత్యాను చూసినవాళ్ళమ్డరూ వావ్ నిత్యా అంటూ తెగ పొగిడేస్తున్నారట. మరి నిన్నమొన్నటివరకూ తన పర్సనాలిటీ ఇష్యూస్ కారణంగా సినిమా ఆఫర్లు దక్కించుకోలేకపోయిన నిత్యామీనన్ ఈ సెకండ్ ఇన్నింగ్స్ తో మళ్ళీ ఫామ్ లోకి వస్తుందేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus