మరోసారి బికినీ ధరించి సోషల్ మీడియా దుమ్ము దులిపేస్తుంది..!

నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ చిత్రంతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్దే. తరువాత వరుణ్ తేజ్ తో ‘ముకుంద’ చిత్రంలో కూడా నటించింది. ఈ చిత్రాలు పెద్దహిట్లు కాకపోయినా పూజా హెగ్దే కు బాలీవుడ్ ఛాన్స్ దక్కింది. అయితే హ్రితిక్ సరసన నటించిన ‘మొహంజదారో’ చిత్రం పెద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో పూజ ని ఎవరూ పట్టించుకోలేదు. ఇక ‘బ్యాక్ టు టాలీవుడ్’ అంటూ వచ్చి ‘డీజే’ చిత్రం చేసింది. ఈ చిత్రంలో బికినీ ధరించి కుర్రకారుతో పాటూ దర్శక నిర్మాతలను కూడా ఆకర్షించి వరుసగా పెద్ద ఆఫర్లు కొట్టేసింది. ఇప్పటికే అల్లు అర్జున్, ఎన్టీఆర్ చిత్రాల్లో నటించిన ఈ భామ ప్రస్తుతం మహేష్, ప్రభాస్ ల తో కలిసి నటిస్తుంది.

పూజా మళ్ళీ క్రేజీ హీరోయిన్ గా మారిపోవడంతో.. బాలీవుడ్ నుండీ మళ్ళీ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఈసారి బాలీవుడ్ లో మంచి గ్రిప్ సాదించాలనుకుంటుందేమో… మరోసారి బికినీ ధరించి హాట్ ఫోటో షూట్లో పాల్గొంది. బికినీ ధరించి చేతులు వెనక్కి పెట్టుకున్న పూజా పచ్చని చెట్ల మధ్యలో నిలబడింది. ఇలా తన ఇన్స్టాగ్రామ్లో ఈ ఫోటోని పోస్ట్ చేసిందో లేదో లక్షల కొద్దీ లింకులతో సోషల్ మీడియా దద్దరిల్లిపోయింది. పూజా గ్లామర్ అలాంటిది. నోరు సరిగ్గా తిరగని బాలయ్య బాబు కూడా గుక్క తిప్పుకోకుండా ‘అరవింద సమేత’ విజయోత్సవ వేడుకలో పూజాని తెగ పొగిడేసాడంటే… ఇందుకే కాబోలు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus