ఓ పక్క తన తండ్రితో ‘సైరా’ వంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తూనే.. మరోపక్క ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి భారీ మల్టీస్టారర్ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్. ‘సైరా’ చిత్రాన్ని దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు రాంచరణ్. కాబట్టి ఆయన బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర్నుండీ.. నటీనటుల అవస్రతలు తీర్చాల్సి ఉంటుంది. సో చరణ్ కు చాలా పనులుంటాయి. అందుకే ‘సైరా’ చిత్రం కోసం రాజమౌళికి షాకిచ్చాడంట రాంచరణ్. అదేంటంటే ‘సైరా’ కోసం కొన్నాళ్ళు ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం షూటింగ్ కు దూరంగా ఉంటానని రాంచరణ్.. రాజమౌళికి చెప్పాడట.
అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం షూటింగ్ ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది. మొదటి షెడ్యూల్ పూర్తయిన తరువాత.. ఎన్టీఆర్ సరసన నటించాల్సిన హీరోయిన్ హ్యాండివ్వడం.. ఆ తరువాత ఎన్టీఆర్, చరణ్ లకు కూడా గాయాలవ్వడంతో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికీ హీరోయిన్ కోసం రాజమౌళి తిరుగుతూనే ఉన్నాడు. ఇక ఈ చిత్రాన్ని 400 కోట్ల బడ్జెట్ తో దానయ్య నిర్మిస్తున్నాడు. ఆల్రెడీ 2020 జూలై 30 న విడుదల చేస్తున్నట్టు ప్రకటించేసారు. ఇలాంటి సమయంలో చరణ్ ‘సైరా’ ప్రమోషన్ల కోసం ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ కు బ్రేక్ అడగడం పై రాజమౌళి, దానయ్యలు నిరాశతో ఉన్నారట.