పోలీస్ పాత్రలో మెప్పించనున్న ముద్దుగుమ్మ!

  • July 17, 2018 / 12:46 PM IST

అందం, అభినయ సామర్ధ్యం, అందాల ఆరబోతకు అడ్డు చెప్పని తెగువ, బికినీ వేయగల బాడీ లాంటి అంశాలన్నీ పుష్కలంగా ఉన్నప్పటికీ.. కేవలం అదృష్టం సహకరించని ఏకైక కారణం చేత ఆఫర్లు అందిపుచ్చుకోలేక ఇబ్బందిపడుతున్న రెజీనాను అదృష్ట దేవత మళ్ళీ కరుణించినట్లుంది. అందుకే అమ్మడికి తెలుగులో మరో అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పటివరకూ రెజీనా నటించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయేమో కానీ.. అమ్మడి నటన, అందాలు మాత్రం ఫెయిల్ అవ్వలేదు. ఈ విషయమే అమ్మడికి హిట్-ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఆఫర్లు తెచ్చిపెడుతోంది.

కెమెరామెన్ టర్నడ్ డైరెక్టర్ నిజర్ షఫీ తెరకెక్కించనున్న థ్రిల్లర్ లో ముగ్గురు కథానాయికలు కీలకపాత్ర పోషించనున్న విషయం తెలిసిందే. త్వరలోనే సెట్స్ కు వెళ్లనున్న ఈ చిత్రంలో రెజీనా ఓ పోలీస్ ఆఫీసర్ గా నటించనుందట. అమ్మడు ఆమధ్య “నక్షత్రం” చిత్రంలో పోలీస్ డ్రెస్ లో కనిపించినప్పటికీ అది బిల్డప్ మాత్రమేనని తర్వాత అర్ధమైంది.

మరి టాలీవుడ్ లో చాలా రోజుల తర్వాత లభించిన ఈ పోలీస్ పాత్రతో రెజీనా తన నటప్రతిభను ఏమేరకు నిరూపించుకొంటుందో చూడాలి. ఈ సినిమా గనుక హిట్ అయితే.. టాలీవుడ్ లో మళ్ళీ అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కట్టడం ఖాయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus