‘ఆర్.ఆర్.ఆర్’ మళ్ళీ ఆగిపోయింది.. కారణం అదే..?

  • July 4, 2019 / 04:22 PM IST

‘బాహుబలి’ వంటి భారీ బడ్జెట్ చిత్రం తరువాత మళ్ళీ అటువంటి భారీ బడ్జెట్ చిత్రాన్నే చేస్తూ నానా కష్టాలు పడుతున్నాడు రాజమౌళి. రాంచరణ్, ఎన్టీఆర్ లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’ మరోసారి షూటింగ్ వాయిదా పడనుంది. వివరాల్లోకి వెళితే కొన్ని కారణాల వల్ల దర్శకుడు రాజమౌళి అమెరికా వెళ్లారట. ఈ నేపథ్యంలో ఓ వారం పాటు షూటింగ్ వాయిదా వేసారని సమాచారం. ఇప్పటికే చరణ్, ఎన్టీఆర్ లకి గాయాలవడంతో షూటింగ్ చాలా రోజులు వాయిదా పడింది.. ఎట్టకేకేలకు వారు కోలుకొని కొన్ని యాక్షన్ సీన్లలో పాల్గొంటూ వస్తున్నారు.

మరో పక్క ఎన్టీఆర్ సరసన హీరోయిన్ కూడా సెట్ అవ్వలేదు. అయినప్పటికీ అనుకున్న సమయానికే సినిమాని విడుదల చేయాలనీ రాజమౌళి నిద్ర లేకుండా కష్టపడుతున్నాడు. చరణ్ కు జోడీగా అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది. అజయ్ దేవగణ్, సముద్రఖని కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2020 జూలై 30న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus