ఫ్లాపిచ్చిన డైరెక్టర్ తోనే సాయిధరమ్ నెక్స్ట్ సినిమా!

  • October 15, 2017 / 01:25 PM IST

సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి కాంబినేషన్స్ ఎలా, ఎందుకు, ఎప్పుడు వర్కవుట్ అవుతాయో ఎవ్వరికీ, ఎప్పటికీ అర్ధం కావు, అర్ధం చేసుకోలేరు కూడా. అలాంటి రేర్ కాంబినేషన్ ఇప్పుడు టాలీవుడ్ లో రిపీట్ అవ్వబోతోంది. అప్పటికే “తిక్క” సినిమాతో కాస్త ఇబ్బందుల్లో సాయిధరమ్ కెరీర్ ను “విన్నర్”తో కంప్లీట్ లూజర్ ని చేసిన గోపీచంద్ మలినేనితో మరోమారు కలిసి వర్క్ చేయనున్నాడు సాయిధరమ్ తేజ్. నేడు సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా మూడు ప్రొజెక్ట్స్ ను ఎనౌన్స్ చేయగా.. అందులో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోయేది మొదటిస్థానంలో ఉంది.

నిజానికి గోపీచంద్ మలినేని తెరకెక్కించిన “బాడీ గార్డ్, పండగ చేస్కో” చిత్రాలు పెద్ద హిట్లేమీ కాదు. ఇక “విన్నర్” గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏముంది. కానీ.. రిజల్ట్ తో సంబంధం లేకుండా తనకు గోపీచంద్ మలినేనితో ఉన్న రిలేషన్ కు వేల్యూ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ తన పుట్టినరోజున ఈ ప్రొజెక్ట్ ను ఎనౌన్స్ చేయడం విశేషం. మరి మలినేని బాబు మొదటిసారి చేసిన తప్పులను సరిదిద్దుకొని సాయిధరమ్ ఇచ్చిన రెండో అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటాడో లేక ఎప్పట్లానే దుర్వినియోగం చేసుకొంటాడో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus