‘కింగ్’ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 3’ తుది దశకు చేరుకుంది. మరో మూడు వారాలు మాత్రమే షో ఉంటుంది. ఇప్పుడు హౌస్ లో 7 మంది మాత్రమే ఉన్నారు. ఇక ‘టాప్’ సంగతి పక్కన పెడితే.. ‘ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా..?’ అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ‘సీజన్ 2’ లో ఇచ్చినట్టే .. ‘సీజన్ 3’ లో కూడా ‘టాపర్ ఆఫ్ ది హౌస్’ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. కాకపోతే ఈసారి చీటీలలో పేర్లు రాసి వారికి స్థానాలు ఇచ్చాడు. అయితే వారిలో వారు ముచ్చటించుకుని ఏ స్థానం కావాలో ఆ స్థానాన్ని వారు దక్కించుకోవాలన్న మాట.
‘నేను నంబర్ 2’ అని రాహుల్ 2 వ నెంబర్ వద్ద నిలుచున్నాడు. దీంతో శ్రీముఖి వచ్చి రాహుల్ తో చర్చ జరిపింది. ‘నువ్వు ఇప్పటి వరకూ బెస్ట్‌గా పెర్ఫామ్ చేసిన ఒక్క టాస్క్ చెప్పు’ అని శ్రీముఖి… రాహుల్‌తో అంది. దీంతో రాహుల్ కు కోపం వచ్చింది. ‘అసలు నువ్వు ఏ టాస్క్ బాగా ఆడావో ముందు చెప్పు అంటూ రాహుల్ కౌంటర్ ఇచ్చాడు. దీంతో శ్రీముఖి మండిపడింది. ‘మాటలు.. మాటలు జాగ్రత్త అంటూ వేలు చూపిస్తూ.. రాహుల్ మీదికి దూసుకువచ్చింది. ఇలా వీరిద్దరూ చాలా రచ్చ చేశారు. మొదటి నుండీ శ్రీముఖి.. రాహుల్ ను టార్గెట్ చేస్తూనే వస్తుంది. ఏదో ఒక రకంగా రాహుల్ ను టార్గెట్ చేసి నామినేట్ చేస్తూనే ఉంది. దీంతో రాహుల్ పై సింపతీ పెరిగి సేఫ్ అవుతూ వస్తున్నాడు. చివరికి శ్రీముఖి వలనే రాహుల్ విన్నర్ అయ్యేలా ఉన్నాడనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?