మళ్లీ కమెడియన్ గా బిజీ అయిపోతున్న సునీల్!

  • July 9, 2018 / 07:48 AM IST

హాస్యనటుడిగా మంచి పేరుతెచ్చుకున్న సునీల్  హీరోగా మారి మొదట్లో మంచి హిట్స్ అందుకున్నారు. ఆ తర్వాత చేసిన సినిమాలు… థియేటర్లోకి వచ్చినట్టే వచ్చి వెళ్లిపోతున్నాయి. ఎంతకష్టపడ్డా హిట్ దరికిచేరడం లేదని.. తానే విజయం వద్దకు వెళ్లారు. అదే తన పాత కమెడియన్ ని బయటికి తెచ్చారు. హాస్యనటుడిగా ఒకే చెప్పారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా చేస్తోన్న “అమర్ అక్బర్ ఆంటోని”  సినిమాలో సునీల్ ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. అలాగే  త్రివిక్రమ్ తన స్నేహితుడు సునీల్ కి అరవింద సమేత వీర రాఘవ సినిమాలో సెక్యూరిటి ఆఫీసర్ పాత్ర ఇచ్చినట్లు తెలిసింది. తన పంచ్ డైలాగులను సునీల్ మరింత ఈజ్ తో చెప్పి చప్పట్లు అందుకోనున్నారు.

సునీల్ కమెడియన్ గా రీ ఎంట్రీలోను అదరగొడుతున్నాడని తెలుసుకున్న దర్శకులు అతనికి  అవకాశాలు ఇస్తున్నట్లు తెలిసింది.  శర్వానంద్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న “పడిపడి లేచే మనసు”లోనూ ఓ కీలకరోల్ చేస్తున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఈ మూడే కాదు త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న సాయి ధరమ్ తేజ్ సినిమాలో మంచి కామెడీ రోల్ పట్టేసారు. “నేను శైలజ” ఫేమ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న “చిత్రలహరి బార్ అండ్ రెస్టారెంట్”  సినిమాలో తేజు ఫ్రెండ్ గా సునీల్ కనిపించబోతున్నారు. ఎంతమంది కొత్త కమెడియన్లు వచ్చినా తన కామెడీ టైమింగ్ తో  సునీల్ అవకాశాలన్నీ తనవైపుకు ఆకర్షిస్తున్నట్లు సినీ విశ్లేషకులు చెప్పారు. ఈ సినిమాలు రిలీజ్ అయితే సునీల్ కి పూర్వవైభవం ఖాయమని భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus