సాధారణంగా ఒక డైరెక్టర్ గనుక తాను తెరకెక్కించిన సినిమాతో హిట్ కొట్టకపోతే.. ఆ సినిమాలో నటించిన హీరో కూడా ఆ డైరెక్టర్ని కేర్ చేయడు. అలాంటిది తమ్ముడు అఖిల్ తో ప్రోపర్ హిట్ కొట్టలేకపోయిన వెంకీ అట్లూరి చెప్పిన కథ నచ్చిందో లేక మిస్టర్ మజ్ను సినిమాని అతను తెరకెక్కించిన విధానం నచ్చిందో తెలియదు కానీ.. వెంకీ అట్లూరికి అవకాశం ఇచ్చాడు నాగచైతన్య. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. “మిస్టర్ మజ్ను” సినిమాతో ఫ్లాప్ చవిచూసిన వెంకీకి వరుస ఆఫర్లు క్యూకట్టాయి.
వాటిలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కే అవకాశం ఉండగా.. ఆ చిత్రంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తాడని టాక్. ఇక మరో సినిమాగా అక్కినేని కాంపౌండ్ లోనే అక్కినేని నాగచైతన్యతో తెరకెక్కించే అవకాశాన్ని ఆల్రెడీ అందిపుచ్చుకోవడంతో.. ఫ్లాప్ వచ్చినా కూడా మనోడి క్రేజ్ తగ్గలేదని, ఒకవేళ హిట్ కొట్టి ఉంటే స్టార్ హీరోలు కూడా పిలిపించేవారని చెప్పుకొంటున్నారు ఫిలిమ్ నగర్ జనాలు. మరి సెకండ్ సినిమాతో హిట్ కొట్టలేకపోయిన వెంకీ అట్లూరి.. మూడో సినిమా విషయంలోనైనా జాగ్రత్త వహించి హిట్ కొడతాదేమో చూడాలి.